Share News

ఊకయార్డు మూసివేత

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:11 AM

ముక్కపాలవలస సమీపంలో ఊకయా ర్డును అఽధికారులు మూతవేయించారు. దీంతో ఎట్టకేలకు గ్రామస్థులకు కాలుష్య సమస్య నుంచి ఊరట లభించింది. పైడిభీమవరం పంచాయతీ పరిధి ముక్కపాలవలస సమీపంలోని పరిశ్రమలతో గ్రామస్థులు కాలుష్యపరంగా ఇబ్బం దిపడుతున్నారు.

  ఊకయార్డు మూసివేత
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, నాగబాబు చిత్రపటాలకు పాల అభిషేకం చేస్తున్న ముక్కుపాలవలస గ్రామస్థులు :

రణస్థలం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ముక్కపాలవలస సమీపంలో ఊకయా ర్డును అఽధికారులు మూతవేయించారు. దీంతో ఎట్టకేలకు గ్రామస్థులకు కాలుష్య సమస్య నుంచి ఊరట లభించింది. పైడిభీమవరం పంచాయతీ పరిధి ముక్కపాలవలస సమీపంలోని పరిశ్రమలతో గ్రామస్థులు కాలుష్యపరంగా ఇబ్బం దిపడుతున్నారు.ఈనేపథ్యంలో గ్రామసమీపంలో ఊకయార్డు, ప్లాస్టిక్‌ డ్రమ్ముల కం పెనీ నుంచి వచ్చేవ్యర్థాలతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఈవిషయంపై గ్రామ స్థులు జనసేన నియోజకవర్గ నాయకుడు విశ్వక్షేన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈ సమస్యను ఎమ్మెల్సీ నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు పంచకర్ల సందీప్‌, జనసేన నేత వడ్డాది శ్రీని వాసరావును అక్కడ పరిస్థతిని తెలియజేయాలని నివేదించారు. వారిచ్చిన వివరా లతో నాగబాబు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటల వ్యవధిలోనే ముక్కుపాలవలస గ్రామ సమీపంలోని ఊకయార్డును మూసి వేయిం చారు దీంతో ముక్కుపాలవలస గ్రామస్థులు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఎమ్మెల్సీ నాగాబాబు చిత్రపటాలకు పాల అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, బస్వా గోవిందరెడ్డి, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ బొంతు విజయకృష్ణ, గొర్లె సూర్య, దన్నాన రవీంద్ర, సువ్వాడ రామారావు, రాంప్రసాద్‌, అప్పన్న, కాకర్ల బాబాజీ పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:11 AM