Share News

మద్యం షాపుల మూసివేత

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:31 AM

:స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో పాతపట్నం, సారవకోట మండలాల్లోని కల్లు, మద్యం దుకాణాలు మంగళ వారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూసివేస్తున్నట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్ౖసజ్‌శాఖ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఆంధ్రాసరిహద్దుకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే మద్యం, కల్లు దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు.

  మద్యం షాపుల మూసివేత
పాతపట్నం చెక్‌పోస్టు వద్ద వాహనతనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు :

పాతపట్నం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి):స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో పాతపట్నం, సారవకోట మండలాల్లోని కల్లు, మద్యం దుకాణాలు మంగళ వారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూసివేస్తున్నట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్ౖసజ్‌శాఖ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఆంధ్రాసరిహద్దుకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉండే మద్యం, కల్లు దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుత వాతావరణం లో జరిపేందుకు ఎకై్ౖసజ్‌శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుర్జిత్‌సింగ్‌ ఆదేశాలమేరకు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మూసివేసి సీలు వేసినట్లు చెప్పారు. మళ్లీ ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత తెర వనున్నట్లు తెలిపారు. ఈనెల ఏడోతేదీన సాయంత్రం ఐదుగంటల వరకూ మద్యం షాపులు మూసివేత అమలులో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర సరి హద్దులో ఒడిశాలోని గజపతి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పర్లాకిమిడి, హడ్డుబంగిలోని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద అక్రమమద్యం రవాణాపై ప్రత్యేకనిఘా ఉంచామని పేర్కొ న్నారు. సారవకోట ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపడతామని తెలిపారు. పాతపట్నం మండలంలోని ఏఎస్‌కవిటి రోడ్‌కూడలి, కె.గోపాలపు రం రోడ్‌తోపాటు మద్యం అక్రమరవాణాకు అవకాశముండే చోట, కల్లు, మ ద్యం దుకాణాల చుట్టూ సిబ్బందితో గస్తీ ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 12:31 AM