బందపల్లి ఆశ్రమ పాఠశాలలో ప్రక్షాళన
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:53 PM
బంద పల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎట్టకేలకు ఐటీడీఏ అధికారులు ప్రక్షాళన ప్రారంభించారు.
మెళియాపుట్టి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): బంద పల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎట్టకేలకు ఐటీడీఏ అధికారులు ప్రక్షాళన ప్రారంభించారు. ఇటీ వల ఆ పాఠశాలలో విద్యార్థులతో కాలు నొక్కించు కున్న ఘటనపై వీడియో వైరల్ కావడంతో ఎల్‌ఎఫ్ ఎల్ హెచ్‌ఎం సుజాతను సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. దీంతోపాటు పీఈటీగా పనిచేస్తున్న కల్యాణి భర్త రామచంద్రరావు ఓ విద్యార్థిపై చేయి చేసుకోవ డంపై ఫిర్యాదులు వెళ్లడంతోపాటు వీడియో వైరల య్యింది. ఈమేరకు రామచంద్రరావుపై కేసు నమోదు చేయడంతోపాటు కల్యాణిని సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడతో ఆగకుండా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకో వాలన్న ఉద్దేశ్యంతో ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ డిప్యూటేషన్లపై పంపిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారని డీడీ అన్నాదొర తెలిపారు. ఈ మేరకు 12 మందిని బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. బందపల్లి ఆశ్రమపాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న ప్రశాంతికుమారికి నేలబొంతు ఆశ్రమపాఠశాలకు, అక్కడ పనిచేస్తున్న విజయభారతికి బందపల్లికి డిప్యూటేషన్ వేసినట్లు చెప్పారు.అలాగే సోషల్ ఉ పాధ్యాయుడు వీరయ్యకు జయపురం, తెలుగు ఉపాధ్యాయుడు రామలింగేశ్వరావుకు పీఎల్‌పురం, పీఎస్ ఉపాధ్యాయిని శ్రీలక్ష్మికి ఎంఎస్‌పల్లి, ఎన్‌ఎస్ ఉపాధ్యాయిని శాంతికి గొట్టిపల్లి పాఠశాలకు డిప్యూటే షన్లపై బదిలీ చేసినట్లు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న సీఆర్పీలకు కూడా డిప్యూటేషన్‌పై బదిలీచేసినట్లు డీడీ అన్నాదొర తెలిపారు.
ఇప్పటికైనా మార్పువచ్చేనా?
బందపల్లి ఆశ్రమపాఠశాలలో ఎన్నడూ లేని విధం గా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతినెలా తనిఖీ చేయాల్సిన అధికారులు సైతం చోద్యంచూడడంతోపాటు,ఇక్కడ జరిగిన విషయాలను ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రక్షాళనకు చర్యలు తీసుకోలేదు. ఈనేపథ్యంలో తరచూ వివాదాలు నెలకొని వార్తల్లోకి ఎక్కన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై గతం లోఉన్న ఐటీడీఏ అధికారులు కూడా దృష్టిసారించలేద న్న విమర్శలుఉన్నాయి. అయితే నూతనంగా బాధ్య తలు స్వీకరించిన పీవో పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రమ పాఠశాలలో ప్రక్షాళన చేయాలని నిర్ణయుంచి డిప్యూటేషన్లపై పంపించా రు.పదోతరగతి పరీక్షలు నెలరోజులే ఉన్న సమయం లో డిప్యూటేషన్లు వేయడంతో దీన్ని ప్రభావం ఉం టుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఆశ్రమ పాఠశాల సిబ్బందిలో మార్పువస్తుందని పలువురు ఆశిస్తున్నారు.