పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:38 PM
పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు.
మెళియాపుట్టి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. శనివారం మెళియా పుట్టిలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పాపారావు, ఎంపీడీవో నరిసిం హపండా, పీఏసీఎస్ అధ్యక్షుడు మోహనరావు, టీడీపీ నాయకులు వెంకటరావు, అన పాన రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఫపాతపట్నం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ సామాజికబాధ్యత అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నంలోని నీల మణిదుర్గ ఆలయ ఆవరణలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనవహారం ప్రద ర్శించి పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఏర్రచెరువు వద్ద ఐ లవ్ యు పాతపట్నం సింబల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.