పరిసరాల పరిశుభ్రత.. సమాజాభివృద్ధికి సూచిక
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:08 AM
పరిసరాల పరిశుభ్రత సమాజాభివృద్ధికి సూచిక అని బీజేపీ రాష్ట్ర సంఘటన్ మంత్రి మధుకర్‌జీ అన్నారు.
బీజేపీ రాష్ట్ర సంఘటన్ మంత్రి మధుకర్‌జీ
అరసవల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత సమాజాభివృద్ధికి సూచిక అని బీజేపీ రాష్ట్ర సంఘటన్ మంత్రి మధుకర్‌జీ అన్నారు. సేవా సంకల్ప్ ఉత్స వాల్లో భాగంగా సోమ వారం నగరంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం, నాగావళి నదీ పరిసరాల్లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహిం చారు. పారిశుధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు. నేతలు బిర్లంగి ఉమా మహేశ్వర రావు, పోకతోట సింహాచలం, అట్టాడ రవిబాబ్జీ, పైడి సింధూర తదితరులు పాల్గొన్నారు.
‘మహిళా సంక్షేమమే ధ్యేయం’
రణస్థలం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ ధ్యేయమని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధు కర్‌జీ అన్నారు. సోమవారం పైడిభీమ వరంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ మిలన్ సేవా కార్యక్రమం నిర్వహిం చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగో పాలం, జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, యువనేత నడుకుదిటి తేజబాబు, నేతలు లంక శ్యామలరావు, వడ్డాది శ్రీను పాల్గొన్నారు.