Share News

గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:53 PM

గురుకులాల్లో పరిశుఽభ్రత పాటించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఏపీ గురుకుల విద్యాలయాల అడిషనల్‌ సెక్ర టరీ రాజలక్ష్మి అన్నారు.

గురుకులాల్లో పరిశుభ్రత పాటించాలి
తామరాపల్లి రెసిడెన్షియల్‌ కళాశాలను పరిశీలిస్తున్న గురుకులాల అడిషనల్‌ సెక్రటరీ రాజ్యలక్ష్మి

ఏపీ గురుకులాల అడిషనల్‌ సెక్రటరీ రాజ్యలక్ష్మి

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/నరసన్నపేట, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో పరిశుఽభ్రత పాటించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఏపీ గురుకుల విద్యాలయాల అడిషనల్‌ సెక్ర టరీ రాజలక్ష్మి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం నరసన్నపేట మండలం తామరాపల్లి ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాల, పాతపట్నం రెసిడెన్షియల్‌ పాఠశాలలను సందర్శిం చారు. వంట గదులు, స్టోర్‌ రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలంలో విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలని సూచిం చారు. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగించాలన్నారు. తామరాపల్లి కళాశాలలో విద్యార్థులకు నీట్‌, ఐఐటీలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. కార్య క్రమంలో గురుకులాల జిల్లా కన్వీనర్‌ యశోద లక్ష్మి, ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:53 PM