బట్టుపాలెంలో ఇరువర్గాల కొట్లాట
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:02 AM
బట్టుపాలెంలో వ్యవసాయ బావి సాగునీటి కోసం శుక్రవారం ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది.
ఐదుగురికి గాయాలు.. కేసు నమోదు
లావేరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): బట్టుపాలెంలో వ్యవసాయ బావి సాగునీటి కోసం శుక్రవారం ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శివాంగం నాగరాజు, శివాంగం చిరంజీవికి చెందిన ఇరువర్గాల మధ్య సాగునీటి కోసం జరిగిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ కొట్లాటలో ఒక వర్గానికి చెందిన శివాంగం నాగరాజు, చైతన్య, సాయి, రెండో వర్గానికి చెందిన చిరంజీవి, శివలకు గాయాలయ్యాయి. గాయప డిన వారిలో ఒక వర్గంవారు శ్రీకాకుళం రిమ్స్‌లో, మరో వర్గం రణస్థలం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.