29 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ..
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:13 AM
ఆ పేద మహిళ సుమారు రెండు నెలల కిందట భర్తను కోల్పోయింది. అప్పటి వరకూ భర్తకు వస్తున్న వృద్ధాప్య పింఛను స్పౌజ్ కోటాలో తనకు ఇప్పించాలని అధికారులను వేడుకుంది.
వితంతు పింఛనుకు పేద మహిళ దూరం
పాతపట్నం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆ పేద మహిళ సుమారు రెండు నెలల కిందట భర్తను కోల్పోయింది. అప్పటి వరకూ భర్తకు వస్తున్న వృద్ధాప్య పింఛను స్పౌజ్ కోటాలో తనకు ఇప్పించాలని అధికారులను వేడుకుంది. అక్కడ అధికారుల నుంచి వచ్చిన సమాధానం విని షాక్‌కు గురైంది. అదేంటంటే ఆ పేద మహిళ పేరిట 29 విద్యుత్ మీటర్లు ఉన్నాయట. ఇదీ మండలంలోని సరాళి గ్రామానికి చెందిన గుణుపురం లచ్చన్న భార్య గౌరమ్మ దుస్థితి. లచ్చన ఇటీవల మృతి చెందడంతో భార్య గౌరమ్మ ఫింఛనుకు దరఖాస్తు చేసుకుంది. ఎంతకూ రాకపోవడంతో సచివాలయ సిబ్బందిని సంప్రదించింది. మృతుని ఆధార్ నెంబర్‌ను పరిశీలిస్తే.. పోలాకి, ఎచ్చెర్ల, రణ స్థలం, పైడి భీమవరంలలో వారి పేరిట 29 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలి పారు. దీని వల్ల పింఛను మంజూరు కావడం లేదని చెప్పారు. దీంతో హతా శురాలైన గౌరమ్మ.. తమకు అన్ని విద్యుత్ కనెక్షన్లు లేవని.. సరిచేసి పింఛను మం జూరు చేయాలని అధికారులను కోరింది. దీనిపై ఎంపీడీవోను హెచ్‌వీ రమణ మూర్తిని సంప్రదించగా విద్యుత్ శాఖాధికారులకు దీనిపై లేఖ రాశామని తెలి పారు. వాటిని తప్పించిన వెంటనే ఫింఛను మంజూరు చేస్తామని తెలిపారు.