శ్లాబు పెచ్చులూడి.. గోడలు బీటలు వారి
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:14 AM
మండలంలోని గోవిందపురం పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. ప్రఽధానంగా మూడు దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో శ్లాబు పెచ్చు లూడుతోంది. గోడలు బీటలు వారడంతో సిబ్బందితోపాటు ఇక్కడకు వస్తున్న రైతులు భయాందోళన చెందుతున్నారు.
x
వజ్రపుకొత్తూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోవిందపురం పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. ప్రఽధానంగా మూడు దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో శ్లాబు పెచ్చు లూడుతోంది. గోడలు బీటలు వారడంతో సిబ్బందితోపాటు ఇక్కడకు వస్తున్న రైతులు భయాందోళన చెందుతున్నారు.
గోవిందపురం పశువైద్యశాల భవనం 1986లో నిర్మించారు. ఇక్కడకు వజ్రపుకొత్తూరు మండలంలోని 25 గ్రామాలతోపాటు నందిగాం మండలానికి చెందిన పాడిరైతులు తమ పశువులను వైద్యసేవలకోసం తీసుకొస్తు న్నారు. అయితే ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచు కోకపోవడంతో భవనం పాడయ్యింది. దీంతో వర్షం కురిస్తే గోడలు, శ్లాబ్ నుంచి నీరు కారి గదంతా చేరువుగా మారుతోందని సిబ్బంది చెప్పారు. భవనం పరిసరాల్లో తుప్పలు, డొంకలు పెరగడంతో దోమలు, ఎలుకలు, పాములు గదిలోకి వస్తున్నాయి. ఈనేపథ్యంలో కిటికీలకు ఇటీవల డాక్టరు కె.మధుబాబు సొంత నిధులతో జాలీలువేశారు. గతంలో ఈ భవనం పశువైద్యశాల సబ్సెంటర్గా ఉండేది. తర్వాత దీనిని అప్ గ్రేడ్చేసి పశువైద్యశాలగా మార్చారు. దీంతో గతంలో పశువైద్యశాలకు చిన్నగదిని కేటాయించిన అధికారులు అదే గదిలోనే ఇప్పటికీ వైద్యశాల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పశువైద్యశాల భవనం నాచుపట్టిలోపల దెబ్బతింది. దీంతో సిబ్బందితో పాటు పశువైద్యశాలకు వచ్చే పాడిరైతులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ప్రధానంగా భారీ వర్షాలు కురిసే, ఈదురుగాలులు వచ్చే సమయంలో మరింత ఆందోళన చెందుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి గోవిందపురం పశువైద్యశాలకు నూతన భవనం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. కాగా నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడదలైన వెంటనే వశువైద్యశాల భవనం నిర్మాణానికి చర్యలు చేపడతామని పశువైద్యాధికారి కె.మధుబాబు చెప్పారు.