ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:26 PM
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను జిల్లాలో పలుచోట్ల ఆయన అభిమానులు శనివారం ఘనంగా నిర్వ హించారు.
శ్రీకాకుళం కల్చరల్/జలుమూరు/ఇచ్ఛాపురం/కవిటి/ఆమదాలవలస, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను జిల్లాలో పలుచోట్ల ఆయన అభిమానులు శనివారం ఘనంగా నిర్వ హించారు. జలుమూరు రాణ కూడలిలో ఆంధ్ర ఫిలిం ఛాంబర్ సభ్యుడు పురిపండ రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్‌చేశారు. ఈ వేడుకల్లో జనసేన నాయకులు లుకలాపు రంజిత్‌కుమార్, తంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాతశ్రీకాకుళంలోని సంతోషి మాత అమ్మవారి ఆలయంలో చిరంజీవి గోత్రనామాలతో అర్చకులు మోదుకూరి కిరణ్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇచ్ఛాపురం ప ట్టణంలో చిరంజీవి అభిమాని అలీంఖాన్ ఆధ్వర్యంలో శనివారం భారీ కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. కవిటి శ్రీమహాలక్ష్మి థియేటర్ వద్ద నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ గంతి మోహన్, జోన్ కన్వీనర్ బీన ప్రసాద్, జిల్లా కో కన్వీనర్ అనిల్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఆమదాలవలస మండలం దూసి ఆర్‌ఎస్‌లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. చిరంజీవి సేవా స్ఫూర్తితో 49 సార్లు రక్తదానం చేసిన రామ్‌కుమార్‌ను సత్కరించారు.