చింతామణి తల్లీ.. కరుణించమ్మా
ABN , Publish Date - May 15 , 2026 | 12:17 AM
Chintamani.. Festivals ఉద్దానం ఇలవేల్పు.. కవిటి చింతామణి అమ్మవారి సంబర మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది.
కవిటిలో వైభవంగా ఉత్సవాలు ప్రారంభం
అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కవిటి, మే 14(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ఇలవేల్పు.. కవిటి చింతామణి అమ్మవారి సంబర మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. కవిటి గ్రామ శివారున ఉన్న ఆలయానికి మేళతాళాలతో అధికసంఖ్యలో భక్తులు తరలివెళ్లి అమ్మవారిని భక్తితో కొలిచారు. తులసికొమ్మలు అమర్చి దానిపై పోకకాయను ఉంచి అర్చకులు చేతులుచాచి దేవీని ఆహ్వానించారు. ప్రత్యేకంగా వెదురుతో సిద్ధం చేసిన బుట్టలో తులసికొమ్మలు, పోకకాయను అమర్చి గ్రామానికి తీసుకువచ్చారు. ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవారిని పూజించారు. మహిళలు, యువకులు సందడి చేశారు. గ్రామమంతా విద్యుత్ దీపాలతో అలంకరించి.. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.