Share News

సందడిగా చింతామణి సంబరాలు

ABN , Publish Date - May 25 , 2026 | 11:44 PM

ఉద్దానం ఇలవేల్పు చింతామణి అమ్మవారి సంబరాలు కవిటి లో సందడిగా కొనసాగుతున్నాయి.

 సందడిగా చింతామణి సంబరాలు
అమ్మవారిని గ్రామానికి ఆహ్వానిస్తున్న మహిళలు

కవిటి, మే 25(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ఇలవేల్పు చింతామణి అమ్మవారి సంబరాలు కవిటి లో సందడిగా కొనసాగుతున్నాయి. 13 రోజులుగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కవిటి పంచాయతీ పరిధి గ్రామాల్లో ఇంటింటికీ అమ్మవారిని తీసుకువెళ్లి మొక్కులు తీర్చుకుంటు న్నారు. కాళికా వేషధారణలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. కవిటిలోని అన్ని వీధులను విద్యుద్దీపాలతో అలంకరించారు. రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో కవిటి వీధులు భక్తులతో కిటకిట లాడాయి. ట్రాపిక్‌ నియంత్రణకు యువకులు చర్యలు చేపడుతున్నారు. బంధువుల రాకతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.

Updated Date - May 25 , 2026 | 11:44 PM