Share News

మహిళా ఎస్‌ఐపై ‘చింతాడ’ ప్రవర్తన దారుణం

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:11 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐపై ఆ పార్టీ నాయకుడు చింతాడ రవికుమార్‌, అతని అను చరులు ప్రవర్తించిన తీరు దారుణమని, ఈ ఘటన సభ్య సమాజానికే తలవంపులు అని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ విమర్శించారు.

మహిళా ఎస్‌ఐపై ‘చింతాడ’ ప్రవర్తన దారుణం
మాట్లాడుతున్న రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే రవికుమార్‌

ఈ ఘటనపై ధర్మాన, బొత్స మాట్లాడరేం..?

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

అరసవల్లి, జూలై 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐపై ఆ పార్టీ నాయకుడు చింతాడ రవికుమార్‌, అతని అను చరులు ప్రవర్తించిన తీరు దారుణమని, ఈ ఘటన సభ్య సమాజానికే తలవంపులు అని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ విమర్శించారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్‌ఐపై చింతాడ, అతని అనుచరులు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె సిగ్గుతో, భయంతో తనను తాను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం చూస్తే సభ్య సమాజంలో మనం జీవిస్తున్నా మా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై ఎస్పీ తక్షణం చర్యలు తీసుకోవాలని, మహిళా ఎస్‌ఐకే రక్షణ లేక పోతే సామాన్య ఉద్యోగులు, మహిళల పరిస్థతి ఏమిటని ప్రశ్నించారు. అతనిపై ఏ సెక్షన్‌లలో కేసు పెట్టారో ఇంతవరకు తెలి యదని, అయితే ఆయన మాత్రం తన అను చరులతో ఏయే కేసులు నమోదు చేశారో నవ్వుతూ చెబుతున్నాడని, దీనిని గమనిస్తే ఎస్పీ కార్యాలయంలోనే వైసీపీ కోవర్టులు న్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఽధర్మాన సోదరులు, బొత్స ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిం చారు. ఇప్పటికైనా మహిళా ఎస్‌ఐపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని గంజాయి బాబుల ఆట కట్టించాలని ఎస్పీని కోరారు. కార్యక్రమంలో కూటమి నేతలు శవ్వాన ఉమామహేశ్వరి, పిరియా విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 12:11 AM