Share News

నైర అసోసియేట్‌ డీన్‌గా చిన్నంనాయుడు

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:06 AM

నైర వ్యవసాయ కళాశాల అసో సియేట్‌ డీన్‌గా డాక్టర్‌ డి.చిన్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు.

నైర అసోసియేట్‌ డీన్‌గా చిన్నంనాయుడు

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నైర వ్యవసాయ కళాశాల అసో సియేట్‌ డీన్‌గా డాక్టర్‌ డి.చిన్నం నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. 1989 లో కళాశాల తొలి బ్యాచ్‌ విద్యార్ధిగా వ్యవ సాయ విద్యను అభ్యసించిన ఆయన అనం తరం అదే కళాశాలలో వ్యవసాయ విస్తరణ విభాగం ప్రొఫెసర్‌గా సేవలందిం చారు. ఆమదాలవలస కేవీకేలోనూ పని చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గవరం పేటకు చెందిన చిన్నంనాయుడు అసోసియేట్‌ డీన్‌గా బాధ్యతలు చేపట్టడంపై కళాశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను విద్యాభ్యాసం చేసిన కళాశాలలోనే అసోసియేట్‌ డీన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తానన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికను విద్యార్థులకు చేరువ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.

Updated Date - Sep 04 , 2026 | 12:06 AM