బాల్యవివాహాలతో సమాజానికి హానికరం
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:04 AM
బాల్యవివాహాలు వ్యక్తిగతంగా బాలిక లతో పాటు సమాజానికి హానికరమని పొందూరు జూనియర్ సివిల్ న్యాయాధి కారి బి.జ్యోత్స్న అన్నారు.
పొందూరు జూనియర్ సివిల్ న్యాయాధికారి బి.జ్యోత్స్న
పొందూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలు వ్యక్తిగతంగా బాలిక లతో పాటు సమాజానికి హానికరమని పొందూరు జూనియర్ సివిల్ న్యాయాధి కారి బి.జ్యోత్స్న అన్నారు. అంతర్జాతీయ బాల్య బలవంతపు వివాహాల నివారణ దినం సందర్భంగా లోలుగు కేజీబీబీని సందర్శించారు. ‘బాల్యవివాహాలు- పరిణా మాలు’ అంశంపై శుక్రవారం విద్యార్థినులకు అవగాహన కలిగించారు. బాల్య వివా హాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. దీని నిర్మూలన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్యవివాహాలు చేసుకున్న వారికి, చేసిన వారికి పడే శిక్షలను వివ రించారు. అనంతరం పాఠశాలలో తరగతి గదులను తనిఖీ చేశారు. వంట సరు కుల నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేశారు విద్యా ర్థినులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని ప్రిన్సిపాల్, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో పి.రాజా రావు, ప్యానెల్ న్యాయవాదులు వైవీ బ్రహ్మం, వై.సురేష్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎ.సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలను నిరోధించండి
సివిల్ న్యాయాధికారి మాధురి
పలాస, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు నేరమని, ఇటువంటివి జరగకుండా నిరోధించాలని పలాస జూనియర్ సివిల్ న్యాయాధికారి యు.మాధురి సూచించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. బాల్య వివాహాలు చేయించిన వారికి, వివాహం చేసుకున్న వారికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించ నున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏపీపీ పి.రమేష్, ఏజీపీ పిండి వెంకటరావు, బి.కామేశ్వరరావు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
‘చట్టరీత్యా నేరం’
జలుమూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను నిరోధించి.. పిల్లల భవిష్యత్‌ను కాపాడుదామని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎ.యశోద అన్నారు. పాఠశాలలో శుక్ర వారం అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు వయసు ఉన్న బాలికలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఆరోగ్యవిస్తరణాధికారి చిన్నరాజులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చైతన్యం కలిగించాలి: ఐసీడీఎస్ అధికారి శోభారాణి
ఎచ్చెర్ల రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాల వల్ల కలిగే అన ర్ధాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఐసీడీఎస్ సాధికారిక అధికారి పి.శోభారాణి అన్నారు. చిలకపాలెంలోని శ్రీ శివానీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఆర్జీయూకేటీ విభా గంలో బాల్య వివాహాల వల్ల నష్టాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు బాల్య వివాహం వల్ల చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లీ, బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉంటుంద న్నారు. అలాగే బాలికలు విద్యకు దూరమై ఉజ్వల భవిష్యత్‌ను కోల్పోతారన్నారు. అందువల్ల 21 ఏళ్లలోపు వివాహం చేయవద్దని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేర మన్నారు. చిన్న వయసులో భరించ లేని బాధ్యతల వల్ల భయం, మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతి రేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైద్యాధికారి వి.అరవింద్, జీసీడీవో ఉమ, ఎఎల్‌ఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ, కమ్యూనిటీ ఆఫీసర్ రమేష్ బాబు, ఐసీ డీఎస్, ఇతర శాఖలు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
‘బాల్య, బలవంతపు వివాహాలు వద్దు’
సరుబుజ్జిలి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాల్య, బలవంతపు వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పీహెచ్‌సీ వైద్యాధికారి సాహితీప్రియదర్శిని సూచిం చారు. అంతర్జాతీయ బాల్య వివాహాల నియంత్రణ దినం సందర్భం గా పభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులో వివాహం వల్ల బాలికల చదు వు మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొం టారన్నారు. దీనివల్ల కలిగే అనర్థాలను వివరించారు. బాలికలు విద్యపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్ పొందాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో క్యాండిల్ ర్యాలీ
ఇచ్ఛాపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధా లపై బ్రెడ్స్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో శుక్రవారం క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. చైల్డ్ మ్యారేజీ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా బాల్యవివాహాలను నిర్మూలించాలని నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో సీడబ్య్లూసీ సభ్యులు జాస్మిన్ కుమారి, మెప్మా ఆర్పీ ఝాన్సీరాణి, బ్రెడ్స్ ఎన్‌జీవో కోఆర్డినేటర్ ఎం.స్వాతి, కేజీబీవీ విద్యార్థినులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో..
ఎచ్చెర్ల, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలి కల గురుకుల పాఠశాల/కళాశాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా శుక్రవారం సాయంత్రం విద్యార్థినులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా బాలల రక్షణ విభాగం, బ్రెడ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరగిన కార్యక్రమంలో బాల్య వివా హాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహం నేరమని, దీనిని నిర్మూ లించాలని నినాదాలుచేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ, అధ్యాపకులు, బాలల రక్షణ విభాగం సిబ్బంది గీత, తేజశ్రీ పాల్గొన్నారు.