బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ABN , Publish Date - May 20 , 2026 | 11:55 PM
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, మే 20 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. ఒప్పంగి గ్రామం లో బుధవారం మహిళలకు పలు చట్టాలపై అవ గాహన కలిగించారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ఫలితాలను వివ రించారు. చిన్నతనంలో వివాహం చేయడం వల్ల అనారోగ్యానికి గురి కావడమే కాకుండా పుట్ట బోయే బిడ్డ మానసిక పరిపక్వత లోపించే ప్రమాదం ఉందన్నారు. మహిళలకు న్యాయపరమైన సహాయాన్ని ఉచితంగా సంస్థ అందిస్తుం దన్నారు. నేరుగా గాని టోల్ ఫ్రీ నంబరు 15100లో గాని సంప్రదించ వచ్చన్నారు. కార్యక్రమంలో జి.శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ ఆదిల్‌షా, న్యాయవాది ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.