Share News

స్వామి సేవలో గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:25 PM

ప్రసిద్ధ శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామిని శుక్రవారం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

స్వామి సేవలో గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జలుమూరు: శ్రీముఖలింగేశ్వరస్వామి చిత్రపటాన్ని జస్టిస్‌ సునీత అగర్వాల్‌కు అందిస్తున్న ఈవో ఏడుకొండలు

గార/జలుమూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామిని శుక్ర వారం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ చరిత్ర, విశిష్టత ను అర్చకులు వివరించారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని ప్రధాన అర్చకులు సీతారామ నరసింహాచార్యులు న్యాయమూర్తికి అందించారు. అలాగే దక్షిణ కాశీగా ప్రసిద్ధిపొందిన శ్రీముఖ లింగంలోని ముఖలింగేశ్వర స్వామిని గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిత్రపటాన్ని ఆలయ ఈవో ఏడుకొండలు అందించగా, అర్చకులు దీవించారు. ఆలయ విశిష్టతను వివరించారు.

Updated Date - Jan 02 , 2026 | 11:25 PM