Share News

ఆదిత్యుని సేవలో ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:21 AM

: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఇన్‌కమ్‌టాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ దండ శ్రీనివాస్‌ బుధవారం దర్శించుకున్నారు.

ఆదిత్యుని సేవలో ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌
అరసవల్లి: జ్ఞాపికను అందజేస్తున్న అర్చకులు, సిబ్బంది

అరసవల్లి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఇన్‌కమ్‌టాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ దండ శ్రీనివాస్‌ బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా అర్చకులు ఆయన పేరుపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వ దించారు. ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటరమణ, జూనియర్‌ అసి స్టెంట్‌ బీఎస్‌ చక్రవర్తి, అర్చకుడు ఇప్పిలి సాందీపశర్మ ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.

శ్రీకూర్మం ఆలయం సందర్శన

గార, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆదాయపు పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ దండ శ్రీనివాస్‌ ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామి ని బుధవారం దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో ఆయన గోత్ర నామా లతో అర్చకులు పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వదిం చారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు సీతా రామ నరసింహాచార్యులు, ఉద్యోగి నర్సిబాబు ఆయనకు అందించారు.

Updated Date - Jan 08 , 2026 | 12:21 AM