Share News

హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:39 PM

హిందూ ధర్మ పరిరక్షకుడిగా, దేశం కోసం, దైవం కోసం పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని, భారతీయుల గుండెల్లో ఆయన ఆరని జ్యోతి అని పలువురు వక్తలు అన్నారు.

హిందూ ధర్మ పరిరక్షకుడు ఛత్రపతి శివాజీ
అరసవల్లి: శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

అరసవల్లి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మ పరిరక్షకుడిగా, దేశం కోసం, దైవం కోసం పోరాడిన మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని, భారతీయుల గుండెల్లో ఆయన ఆరని జ్యోతి అని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని శాంతినగర్‌ కాలనీలోని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి వనంలో ఛత్రపతి శివాజీ జయం తిని గురువారం నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. శివాజీ గొప్పదనాన్ని కీర్తిస్తూ అవధాని పైడి హరనాథరావు గేయం ఆలపించారు. కార్య క్రమంలో గాంధీ మందిరం సభ్యులు డా.చింతాడ కృష్ణ మోహన్‌, పి.రాజశేఖర్‌, ఎం.అనంత భట్లు, పందిరి అప్పా రావు, తర్లాడ అప్పలనాయుడు, జామి భీమశంకరరావు, జి.నా గేశ్వరరావు, సువ్వారి రాజారావు, ఎంవీవీఎస్‌ శాస్త్రి తదిత రులు పాల్గొన్నారు.

రణస్థలంలో..

రణస్థలం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లోని ఒక ప్రైవేటు కళాశాలలో ప్రఖండ ప్రముఖ్‌ కె.రాజ శేఖర్‌ ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీహెచ్‌పీ ఉత్తరాంధ్ర ప్రతినిధులు పొగిరి సూర్యనారాయణ, బొంతు రమణ మాట్లాడుతూ భారతావని లోకానికి అందించిన చారిత్రక పురుషుడు శివాజీ అని కొనియాడారు. పలువురు స్థానిక ప్రతినిధులు పాల్గొ న్నారు.

టెక్కలిలో శోభాయాత్ర

టెక్కలి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి సందర్భంగా గురువారం బీజేపీ, ఆర్‌ఎస్‌ ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో టెక్కలిలో శోభా యాత్ర నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఇందిరా గాంధీ కూడలి మీదుగా అంబేడ్కర్‌ కూడలి వరకు జై శివాజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూరి నరేంద్ర చక్రవర్తి, జర్జాన రామ్‌జీ, రాజ కుమార్‌ రెడ్డి, లక్ష్మీనారాయణ, ఆనందరావు, చంద్రశేఖర్‌ పట్నాయక్‌, బొడ్డ అయ్యబాబు, గేదెల చంద్రశేఖరరెడ్డి తదితరుల పాల్గొన్నారు.

పోరాట యోధుడు శివాజీ

పలాస రూరల్‌/కాశీబుగ్గ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): స్వరాజ్య సాధన కోసం మొఘల్‌ చక్రవర్తులతో జీవితాంతం పోరాడిన మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అని పలువురు కొనియాడారు. పలాస మండలం గోపాలపురంలో గురువారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహా నికి హిందూ అభిమానులు, శివాజీ యువసేన ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఊరేగింపు నిర్వహిం చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు కొక్కిరి దేవదత్తం, కిషోర్‌ పాత్రో, వీహెచ్‌పీ సభ్యులు చంద్రమౌళి, విజయ కుమార్‌ పట్నాయక్‌, బీజేపీ నాయకులు పురుషోత్తం త్యాడి, కొక్కిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గలో బీజేపీ నాయకులు వైకుంఠరావు, తారకేశ్వరావు, రామానందస్వామి ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వ హించారు. పార్టీ నాయకులు మోహన్‌రాజ్‌, దుదిష్టి, భుజంగ రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:39 PM