సృజనాత్మకత పెంచేందుకు ‘చెకుముకి’ దోహదం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:04 AM
ద్యార్థుల్లో సృజన్మాతకత, ప్రశ్నించే తత్వంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొం దించేందుకు చెకుముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని డీఈవో ఎ.రవిబాబు అన్నారు.
డీఈవో రవిబాబు
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజన్మాతకత, ప్రశ్నించే తత్వంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొం దించేందుకు చెకుముకి సైన్సు సంబరాలు దోహదపడతాయని డీఈవో ఎ.రవిబాబు అన్నారు. నగరంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెకుముకి సైన్సు సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజల్లో సైన్సు పట్ల ఆసక్తి, పర్యావరణ పరిరక్షణకు జేవీవీ చేస్తున్న కృషి అభినందనీయ మన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అం దించారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారి పి.విలియం, రిటైర్డు డీఈవో బలివాడ మల్లేశ్వరరావు, కొత్తకోట అప్పారావు, జేవీవీ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి, హెచ్‌ఎం సుజాత, జిల్లా హెచ్‌ఎంల సంఘ అధ్యక్షుడు వి.సత్యనారాయణ, సైన్స్ సంబరాలు కన్వీనర్ పి.కూర్మారావు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సోంపేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి చెకుముకి పోటీల్లో మోడల్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పదుము ఉషశ్రీ, సుబుద్ది హరిచరణ్, రత్నాల లిఖిత మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ చిన్నాజీ వర్మ, ఉపాధ్యాయులు అభినందించారు.