Share News

పెట్రోల్‌ బంకులో తనిఖీలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:14 AM

స్థానిక పాతబస్టాండ్‌లోగల ఒక పెట్రోల్‌ బంకును తూనికలు, కొలతలు శాఖ సహాయక కమిషనర్‌ చిన్మమ్మి శనివారం తనిఖీ చేశారు.

పెట్రోల్‌ బంకులో తనిఖీలు
పెట్రోల్‌ బంకులో తనిఖీలు చేస్తున్న తూనికలు, కొలతలు అధికారులు

నరసన్నపేట, మార్చి 28(ఆంధ్రజ్యోతి): స్థానిక పాతబస్టాండ్‌లోగల ఒక పెట్రోల్‌ బంకును తూనికలు, కొలతలు శాఖ సహాయక కమిషనర్‌ చిన్మమ్మి శనివారం తనిఖీ చేశారు. సంబంధిత పెట్రోల్‌ బంకులో కొలతలు తేడా ఉన్నాయంటూ పలువురు ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ మేరకు ఆమె స్పందించి పెట్రోల్‌ బంకులో తనికీ చేపట్టి, కొలతలను పరిశీలించారు. తాను పరిశీలించే సమయంలో ఎటువంటి తేడాలు కనిపించలేదని ఆమె స్పష్టం చేశారు. సక్రమంగా కొలతలు నిర్వహించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Updated Date - Mar 29 , 2026 | 12:14 AM