Share News

అప్పటి వరకూ కబుర్లు చెబుతూ..

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:59 AM

అప్పటి వరకూ తల్లిదండ్రులతో ముద్దుముద్దుగా కబుర్లు చెబుతూ గడిపిన ఆ చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది.

అప్పటి వరకూ కబుర్లు చెబుతూ..
నవ్య (ఫైల్‌)

  • పాము కాటుతో చిన్నారి మృతి

మెళియాపుట్టి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అప్పటి వరకూ తల్లిదండ్రులతో ముద్దుముద్దుగా కబుర్లు చెబుతూ గడిపిన ఆ చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది. ఈ విషాద సంఘటన గొట్టిపల్లిలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికుల కథనం మేరకు వివరాలివీ... గొట్టిపల్లి గ్రామానికి చెందిన దేశారి నవ్య(6)అనే చిన్నారి బుధవారం వేకువజామున పాము కాటుతో మృతి చెందినట్లు తల్లి నీలవేణి తెలిపారు. రాత్రి తండ్రి అప్పలస్వామితో కలిసి నిద్రిస్తున్న నవ్యకు పాము కాటు వేసింది. నోటిలో నురగలు రావడంతో గుర్తించిన తల్లి కేకలు వేసింది. పక్క ఇంటిలో ఉన్న దేశారి రాములు వచ్చి పరిశీలిస్తుండగా.. అతనిని కూడా పాము వేసింది. ప్రస్తుతం ఆయన టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నవ్యకు రాజు అనే సోదరుడు ఉన్నాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Oct 22 , 2026 | 12:59 AM