Share News

సారా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలి

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:09 AM

సారా కేసులతోపాటు ఇతర కేసులపై సం బంధిత కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుర్జిత్‌సింగ్‌ ఆదేశించారు. సారా నియంత్రణలో అప్ర మత్తంగా ఉండాలని కోరారు.

సారా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలి
వసుందర చెక్‌పోస్టువద్ద అధికారులకు సూచనలిస్తున్న సుర్జీత్‌ సింగ్‌

పాతపట్నం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): సారా కేసులతోపాటు ఇతర కేసులపై సం బంధిత కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుర్జిత్‌సింగ్‌ ఆదేశించారు. సారా నియంత్రణలో అప్ర మత్తంగా ఉండాలని కోరారు. గురువారం పాతపట్నంలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయం లో రికార్డులను పరిశీలించారు. పాతపట్నం కార్యాలయంపరిధిలోని బొన్ని, కోణంగి, పూతిక గూడ, చాపరాయిగూడ బి కేటగిరి గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. అనంతరం మెళియాపుట్టి మండలంలోని వసుంధర వద్దగల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా నిషేధిత సారా తదితర వస్తువుల అక్రమ రవాణా, నియంత్రణపై ఎస్‌ఐ జోగారావు, మోనటరింగ్‌ అధికారి సీఐ కె.కృష్ణారావులకు సూచనలిచ్చారు. ఆయన వెంట ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ జిల్లా అధికారి సీహెచ్‌ తిరుపతినాయుడు ఉన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 12:10 AM