బస్సులు మారుతూ.. గంజాయి తరలిస్తూ..
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:21 AM
ఒడిశా నుం చి బెంగళూరుకు తరలిస్తున్న 7.5 కిలోల గంజాయి ని లావేరు పోలీ సులు, రెవెన్యూ సిబ్బంది కలిసి గురువారం సుభ ద్రాపురం జంక్షన్‌లో స్వాధీనం చేసుకున్నారు.
సుభద్రాపురం జంక్షన్‌లో 7.5 కిలోల గంజాయి స్వాధీనం
లావేరు, మా ర్చి 12(ఆంధ్రజ్యో తి): ఒడిశా నుం చి బెంగళూరుకు తరలిస్తున్న 7.5 కిలోల గంజాయి ని లావేరు పోలీ సులు, రెవెన్యూ సిబ్బంది కలిసి గురువారం సుభ ద్రాపురం జంక్షన్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు ఒడిశా నుం చి బెంగళూరుకు తరలించే క్రమంలో పలుబస్సులు మారాడు. పోలీసుల కథనం మేరకు... కేరళలోని పల్లీపాత్ గ్రామానికి చెందిన అబ్దుల్ రావూఫ్ ఒడిశా నుంచి బెంగళూరుకు బస్సులో గంజాయి తరలిస్తున్న క్రమంలో సుభద్రాపురం జంక్షన్ వద్ద బస్సు దిగాడు. తిరిగి విశాఖ రైల్వేస్టేషన్‌కు వెళ్లే క్రమంలో ఆ జంక్షన్‌లో పో లీసులు ఉండడాన్ని గమనించాడు. ఆ సమయంలో అబ్దుల్ రావూఫ్ ఆతృతతో ఉండడాన్ని గమనించిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆయన్ను పట్టుకుని తని ఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ఈ గంజాయి తరలించే క్రమంలో అబ్దుల్ రావూఫ్ తొలుత ఒడిశాలోని మహేంద్రగడ నుంచి పర్లాకిమిడికి ఒక బస్సు, అక్కడి నుంచి పలాసకు ఒక బస్సు, అక్కడి నుంచి సుభద్రాపురం వరకు మరో బస్సులో ప్రయాణించాడు. దీంతో గంజాయితోపాటు అబ్దుల్ రావూఫ్‌ను లావేరు పోలీసులు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం శ్రీకా కుళం కోర్టులో హాజరుపరిచనట్టు ఎస్‌ఐ కొండపల్లి అప్పలసూరి తెలిపారు. జేఆర్‌పురం సీఐ అవతారం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.