కూటమి పాలనతో మార్పులు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:30 PM
కూట మి ప్రభుత్వ పాలనలో ప్రజా జీవితాలలో సాను కూల మార్పులు వచ్చా యని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వ పాలనలో ప్రజా జీవితాలలో సాను కూల మార్పులు వచ్చా యని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక నీలకంఠాపురం వీధిలో ఆదివారం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృది, ్ధ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో గణనీయమైన పురోగతి సాధించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.