చంద్రన్నా.. సుఖీభవ
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:27 AM
People flocked to Anna canteens ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు రూ.76లక్షల భారీ విరాళం అందించారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో సామాన్య ప్రజలకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించారు.
అన్న క్యాంటీన్లకు పోటెత్తిన జనం
సీఎం జన్మదిన వేడుక వేళ.. ఉచిత భోజనం
శ్రీకాకుళం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు రూ.76లక్షల భారీ విరాళం అందించారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో సామాన్య ప్రజలకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించారు. సోమవారం ఉదయం నుంచే క్యాంటీన్ల వద్దకు జనం పెద్దఎత్తున పోటెత్తారు. జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. భోజనాలు వడ్డించారు. శ్రీకాకుళంతోపాటు పలాస-కాశీబుగ్గ, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, టెక్కలి, కోటబొమ్మాళి, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో మొత్తం పది అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఈ క్యాంటీన్లలో కార్మికులు, చిరువ్యాపారులు తదితర వర్గాలకు చెందిన సుమారు పదివేల మంది.. సోమవారం ఉచితంగా అల్ఫాహారం, భోజనం చేశారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. అన్నదాత సుఖీభవ అని పలువురు పెద్దలు ఆశీర్వదించారు.