Share News

చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతి

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:38 PM

: సీఎం నారా చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతి అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలి పారు. మొదటి నుంచి అంగనవాడీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వస్తోందని చెప్పారు.

చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతి
పాతపట్నం: మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు :

పాతపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): సీఎం నారా చంద్రబాబునాయుడు మహిళా పక్షపాతి అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలి పారు. మొదటి నుంచి అంగనవాడీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వస్తోందని చెప్పారు. ఐదు వేలమంది సహాయకులను నియమించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సైలాడ సతీష్‌, మంచు కృష్ణారావు, ఎస్‌.మధుబాబు, అక్కంద్ర సన్యాసిరావు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికభావాలతో సమాజాభివృద్ధి

ఎల్‌.ఎన్‌.పేట, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడం ద్వారా సమాజాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలి పారు. మండలంలోని మోదుగవలసజంక్షన్‌లో గల రామలింగేశ్వరాలయ 32వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి 20వేల రూపాయలు అందజేశారు. ఆయనతోపాటు టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం. మోహనరావు, కె.చిరంజీవులు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కె.మన్మథరావు, ఆనందరావు, కృష్ణమాచారి, పోలినాయుడు, వి.గోవిందరావు, సీహెచ్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 11:38 PM