వంశధారనదిలో చక్రతీర్థ స్నానాలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:46 PM
మండలంలోని లుకలాంలో త్రిశూల ఉమాకామేశ్వరి స్వామి చక్రతీర్థస్నానాలు మంగళవారం రుత్వీకులు, కన్నెపల్లి వారి వంశ సభ్యులు ఆధ్వర్యంలో జరిగాయి.
నరసన్నపేట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లుకలాంలో త్రిశూల ఉమాకామేశ్వరి స్వామి చక్రతీర్థస్నానాలు మంగళవారం రుత్వీకులు, కన్నెపల్లి వారి వంశ సభ్యులు ఆధ్వర్యంలో జరిగాయి. కామేశ్వరపేట నుంచి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉరేగించి వంశధార నదిలోకి తీసుకురాగా, పురోహితులు నగరంపల్లి సుబ్ర హ్మణ్య సోదరులు, సుసరాం సూర్యం ప్రత్యేకపూజలు చేయించారు. శ్రీకాకుళం రూర ల్, ఆమదాలవలస, నరసన్నపేట, గార తదితర మండలాలు నుంచి వేలాది మంది భక్తులు చక్రతీర్ధస్నానాలకు చేశారు. ఈసందర్భంగా నదితీరంలో పెద్దలకు పిండప్రదా నం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లుచేశారు. కార్యక్రమంలో మణిక్యల సూర్యనారాయణరావు, చింతల వెంకటరమణ, ఈవో మాదవి, తవిటినాయుడు, కీర్తి సీతారాం పాల్గొన్నారు.