శ్రీకాకుళంలో చైన్‌స్నాచింగ్
ABN , Publish Date - May 21 , 2026 | 11:58 PM
వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
శ్రీకాకుళం రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి): వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం రూరల్ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన గూణ కస్తూరిబాయి(63) గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సిద్ధిపేట నుంచి బలగ రోడ్డు దారిలో నడుస్తోంది. బ్రిడ్జి సమీపంలోని రామగెడ్డ వద్ద నడుస్తున్న క్రమంలో కస్తూరిబాయి మెడలో ఉన్న సుమారు మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునుట్లు రూరల్ ఎస్‌ఐ -2 జె.రామారావు తెలిపారు.