Share News

మాస్క్‌ ధరించి.. బైక్‌పై వచ్చి..

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:21 AM

Two chain snatchers arrest ఉత్తరాంధ్రలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతూ.. తప్పించుకు తిరుగుతున్న దొంగల ను శ్రీకాకుళం, విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. గురువారం విశాఖపట్నం జిల్లా సబ్బవరం జంక్షన్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

మాస్క్‌ ధరించి.. బైక్‌పై వచ్చి..
మాట్లాడుతున్న ఏఎస్పీ శ్రీనివాసరావు, పోలీసుల అదుపులో నిందితులు

మాస్క్‌ ధరించి.. బైక్‌పై వచ్చి..

పట్టుబడిన ఇద్దరు చైన్‌స్నాచర్స్‌

నిందితులు డెంకాడ వాసులు

నరసన్నపేట, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతూ.. తప్పించుకు తిరుగుతున్న దొంగల ను శ్రీకాకుళం, విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. గురువారం విశాఖపట్నం జిల్లా సబ్బవరం జంక్షన్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గురువారం నరసన్న పేట సీఐ కార్యాలయంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు ఇందుకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 23న నూకాలమ్మ గుడి వద్ద ఇద్దరు వ్యక్తులు పద్మ అనే మహిళ మెడలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. వారిద్దరూ ముఖానికి మాస్క్‌ ధరించి, నెంబర్‌ లేని ద్విచక్ర వాహనంపై వచ్చి దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో దీనిపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విజ యనగరం జిల్లాలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసు కున్నాయి. దీనిపై ఎస్పీ మహేశ్వరరెడ్డి, విజయనగరం ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు రెండు జిల్లాల పోలీసులు ప్రత్యే క బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధా రాలతో ఆ ఇద్దరి వ్యక్తుల కదలికపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో గురువారం విశాఖపట్నం జిల్లా సబ్బవరం జంక్షన్‌ వద్ద వారిద్దరూ ద్విచక్ర వాహనంపై కనిపించగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో చైన్‌స్నాచింగ్‌ బండారం బయటపడింది. విజయనగరం జిల్లా డెంకాడలోని వెంగమాంబకు వీధికి చెందిన ముండూర సంతోష్‌కుమార్‌, హరిజనవీధికి చెందిన బూర అశోక్‌గా వారిద్దరినీ గుర్తించా రు. జల్సాలకు అలవాటుపడి ఉత్తరాంధ్రలో నరసన్నపేట, పోలాకి, శ్రీకాకుళం రూరల్‌, రామభధ్రపురం, గోపాలపట్నం, పెందుర్తి పరిధిలో గడిచిన రెండేళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి.. రూ.23 లక్షల విలువైన పదమూడున్నర తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామ’ని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలి పారు. చోరీలకు ఉపయోగించే దిచక్రవాహ నాన్ని సీజ్‌ చేశామని, వారిద్దరినీ రిమాం డ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన కానిస్టేబుల్స్‌ దాలినాయుడు, ఆదినారాయణ, శ్రీనుకు ఎస్పీ మహేశ్వరరెడ్డి రివార్డు ప్రకటించారని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, నరసన్నపేట, డెంకాడ, రామభద్రపురం ఎస్‌ఐలు గణేష్‌, సన్యాశినాయుడు, జ్ఞానప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:21 AM