కేంద్రీకృత వంటశాలలను నిలుపుదల చేయాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:46 PM
మధ్యాహ్న భోజన వంట కార్మికులకు, విద్యా ర్థులకు నష్టదాయక మైన కేంద్రీ కృత వంటశాలలను తక్షణం నిలుపుదల చేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, మధ్యాహ్న భోజన వంట కార్మికుల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట మిడ్డేమీల్ వంట కార్మికుల ధర్నా
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన వంట కార్మికులకు, విద్యా ర్థులకు నష్టదాయక మైన కేంద్రీ కృత వంటశాలలను తక్షణం నిలుపుదల చేయాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, మధ్యాహ్న భోజన వంట కార్మికుల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. సుశీల, బి.ఉత్తర డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్‌లు రద్దు చేయాలని, సమస్యలను పరిష్క రించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంట కార్మికుల వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బడిపిల్లల మెనూ చార్జీలను పెంచాలని కోరారు. కార్మికులకు రోజుకు కేవలం రూ.100 వేతనం ఇస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతినెలా 5వ తేదీ లోగా బిల్లులు, వేతనాలు చెల్లించాలని, షెడ్లు, మంచినీటి సదుపాయం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి. ప్రవీణ, వి.లక్ష్మి, కౌసల్య, ఉమ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.