‘బ్యాంకు ఉద్యోగులపై కేంద్రం నిర్లక్ష్యం’
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:15 AM
బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు విమర్శించారు.
శ్రీకాకుళం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు విమర్శించారు. ఆదివారం స్థానికంగా ఓ ప్రైవేటు హోటల్‌లో ఆల్ ఇండి యా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల బ్యాంక్ ఎంప్లాయీస్ కో-ఆర్డి నేషన్ కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై ఫెడరేషన్ పోరా టం చేస్తోందన్నారు. బ్యాంకుల్లో అవసరం మేరకు నియామకాలు చేప ట్టక పోవడం వల్ల ప్రస్తుత ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రమవుతోందని, దీనివల్ల నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియా మకాలు చేయకుండా కేవ లం తాత్కాలిక నియామకాలతో కేంద్ర మభ్యపెడుతోందని విమర్శించారు. ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రానున్న రోజుల్లో ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయనున్నామన్నారు. అనంతరం రెండు జిల్లాల కార్యవర్గాలను ఎన్నుకున్నారు.
జిల్లా కమిటీలు ఇవే..
శ్రీకాకుళం జిల్లా సంఘం అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా గిరిధర్ నాయక్, సెక్రటరీ బి.శ్రీనివాసులు, డెప్యూటీ సెక్రటరీ కామరాజు, ఉపాధ్యక్షులుగా జి.చంద్రమౌళి, ఎం.కిరణ్, జి.రమేష్, ఎ.సూర్యలతో పాటు ఇతర సభ్యు లను ఎన్నుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎస్.సాయి శ్రీనివాస్, సెక్రటరీ దిలీప్ కుమార్ చౌదరి, డెప్యూటీ సెక్రట రీగా కె.కిశోర్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.చైతన్య తేజ, బి.సోమశేఖర్, కె.బాలకృష్ణ, రజనాన వి.నారాజ్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు టి.రవీంద్రనాథ్, డెప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉదయ్ కుమార్, సెంట్రల్ కమిటీ సభ్యులు కమలాకర్, వసంతరావుతో పాటు రెండు జిల్లాల బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.