Share News

‘సీఈసీ జ్ఞానేష్‌ రాజీనామా చేయాలి’

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:01 AM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని ప్రగతిశీల కార్మిక సమూఖ్య సభ్యులు డిమాండ్‌ చేశారు.

‘సీఈసీ జ్ఞానేష్‌ రాజీనామా చేయాలి’
టెక్కలి: నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు

పలాసరూరల్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని ప్రగతిశీల కార్మిక సమూఖ్య సభ్యులు డిమాండ్‌ చేశారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సంఘాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ, నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 13కోట్ల ఓట్లను తొలగించారని, వాటిని చేర్పించే వరకూ పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించేలా రాష్ట్రపతి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, కార్యదర్శి పుచ్చ దుర్యోధన, కార్యవర్గ సభ్యులు కారి పురుషోత్తం, సాలిన ఈశ్వరరావు, మామిడి గణపతి, తామాడ లత,వంకల కోదండరావు, మన్మథరావు పాల్గొన్నారు.

టెక్కలి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌ను తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం టెక్కలిలో నిరసన చేపట్టారు. మోదీ, అమిత్‌షా కనుసన్నల్లో ఎన్నికల అధికారి పనిచేస్తున్నారని ఆరోపిం చారు. రాష్ట్రంలో 32లక్షల మంది ఓట్లు తొలగిస్తే చంద్రబాబునాయుడు సీఈసీకి మద్దతుగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయ కులు నంబూరు షణ్ముఖరావు, హనుమంతు ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు, లక్ష్మణరావు, గడ్డయ్య, శాంతారావు, సాంభమూర్తి, బెలమర ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:01 AM