సీఈసీ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:10 AM
భారత ప్రధాన ఎన్నికల కమిష నర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నగరం లో శుక్రవారం నిరసన చేపట్టారు.
వామపక్ష నేతల డిమాండ్
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత ప్రధాన ఎన్నికల కమిష నర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నగరం లో శుక్రవారం నిరసన చేపట్టారు. ఎన్‌జీవో హోం నుంచి మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించారు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మా ట్లాడుతూ.. ‘సర్’, ఫారం-6లో మార్పులపై ఎన్ని కల నిబంధనల అమలుపై ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేసిన ఆందోళనకు ఈ దర్యాప్తులోని అం శాలు బలం చేకూర్చాయన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపి వేయాలని, అర్హులందరికీ ఓటు హక్కు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు లు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరరావు పాల్గొన్నారు.
సోంపేటలో నిరసన ర్యాలీ
సోంపేట, అక్టోబరు2 (ఆంఽధ్రజ్యోతి): భారత ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వామపక్ష నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. గాంధీ మండపం వద్ద నిరసన చేపట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు సంగారు లక్ష్మీనారాయణ, కె.గోపీనాథ్, ఎస్.నారాయణస్వామి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.