మార్కెట్ సెస్ విధిస్తే జీడి పరిశ్రమలు బంద్ చేస్తాం
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:38 PM
డిపప్పుపై మార్కెట్ కమిటీకి ఒక శాతం సెస్ కట్టాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు మంగళవారం జీడి వ్యాపారులతో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.
-అధికారులతో వ్యాపారుల వాగ్వాదం
పలాస, జూన్ 23(ఆంధ్రజ్యోతి): జీడిపప్పుపై మార్కెట్ కమిటీకి ఒక శాతం సెస్ కట్టాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ శాఖ అధికారులు మంగళవారం జీడి వ్యాపారులతో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. జీడిపప్పుపై బలవంతపు సెస్ విధిస్తే రాష్ట్రవ్యాప్తంగా జీడి పరిశ్రమలన్నీ బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరించారు. పలాస ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక జీడి వ్యాపారుల సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ముఖ్యఅతిథిగా మార్కెటింగ్ కమిటీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పీవీ సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ సమస్యను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపార సంఘ నాయకులు మల్లా రామేశ్వరరావు, సిందిరి సతీష్‌కుమార్, పట్నాన రవికాంత్, మల్లా సురేష్ కుమార్, ఎరుకోల సుధాకర్, తూముల శ్రీనివాసరావు, మల్లా కాంతారావు మాట్లాడుతూ జీడి పప్పుపై పన్ను విధించడం అన్యాయమన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఒక శాతం పన్ను విధించడం వెన్ను విరిచినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. జీడి మార్కెట్ సెస్ విధానంలో ఉన ్న లోపాలను సవరించాలని కోరారు. జీడిపప్పునకు పర్మిట్ తీసుకునే ప్రసక్తే లేదని, తేల్చి చెప్పారు. వ్యాపారులకు పన్నుల విధానంపె ఆర్‌జేడీ వివరణ ఇవ్వడంతో పాటు వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీఎంఏ కార్యదర్శి టంకాల రవిశంకర్‌గుప్తా, కోశాధికారి మల్లా సంతోష్ కుమార్, కోట్ని శశి, డోకి రామారావు, బెల్లాల నారాయణరావు, కేవీ శివకృష్ణ, జిల్లా ట్రేడ్‌మార్కెటింగ్ అధికారి పి.రవికిరణ్, ఏడీఎం యోషన్‌తో పాటు వ్యాపారులు పాల్గొన్నారు.