‘అక్రమంగా నగదు తరలిస్తే కేసులు’
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:47 PM
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి ఆధారాలు లేకుండా నగదు తరలించినా.. మద్యం, గంజాయి తరలించినా కేసులు నమోదు చేస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి తర్ర నాగేశ్వరరావు తెలిపారు. చల్లవానిపేట కూడలిలో శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు.
జలుమూరు, నవంబరు 20 (ఆంద్రజ్యోతి): ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి ఆధారాలు లేకుండా నగదు తరలించినా.. మద్యం, గంజాయి తరలించినా కేసులు నమోదు చేస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి తర్ర నాగేశ్వరరావు తెలిపారు. చల్లవానిపేట కూడలిలో శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. అక్రమంగా మత్తు పదార్థాలు, నగదు తరలిస్తే వాటిని స్వాధీన పరచుకొని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ తనిఖీల్లో పోలీసులు పాల్గొన్నారు.