Share News

వైసీపీ పాలనపై ప్రశ్నిస్తే కేసులు: అచ్చెన్న

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:38 AM

వైసీపీ పా లనలో జరిగే త ప్పులపై అప్పట్లో ప్రజలు ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన పరి స్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి మారిందని బాధితులు ధైర్యంగా చెబుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

వైసీపీ పాలనపై ప్రశ్నిస్తే కేసులు: అచ్చెన్న
సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ పా లనలో జరిగే త ప్పులపై అప్పట్లో ప్రజలు ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన పరి స్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితి మారిందని బాధితులు ధైర్యంగా చెబుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిమ్మా డలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు మంత్రి స్వయంగా తెలు సుకుని వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వంలోని నాయకులు ప్రజల ఆస్తు లు, భూములు దోచుకున్నారని వాటిపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజల నుంచి అధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున వినతలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:38 AM