Share News

సోంపేట నుంచి టెక్కలి ఏపీపీకి కేసు బదిలీ

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:58 PM

జిల్లాలోని సోంపేట ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణలో ఉన్న ఓ కీలక కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ బాధ్యతలను టెక్కలి అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు ఏపీపీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సోంపేట నుంచి టెక్కలి ఏపీపీకి కేసు బదిలీ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

శ్రీకాకుళం/సోంపేట, అక్టోబరు12 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలోని సోంపేట ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణలో ఉన్న ఓ కీలక కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ బాధ్యతలను టెక్కలి అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు ఏపీపీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నెం 1299 విడుదల చేసింది. వివరాలిలా ఉన్నాయి.. సోంపేట ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో ఎస్పీ నెం. 60/2023 కేసు విచారణ దశలో ఉంది. ఈ కేసులో ప్రస్తుతం ప్రభుత్వం తరఫున వాదించాల్సిన ఏపీపీ తాను పదవి చేపట్టకముందు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తుల తరఫున వకాల్తా దాఖలు చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌కు ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్‌ బాధ్యతలను ఏపీపీకి అప్పగిస్తూ ఉత్తర్వు లు విడుదల చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌కు రాష్ట్రహోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. కేసు తరఫున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాది ఆ తరువాత ఏపీపీగా నియమితులై అదే కేసులో ప్రభుత్వం తరఫున వాదించాల్సి రావడంతో న్యాయపర మైన చిక్కుల కు దారితీసే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

Updated Date - Oct 12 , 2026 | 11:58 PM