నలుగురిపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:09 AM
మండలంలోని కోవిలాం గ్రామంలో ఎన్నికల సందర్భంగా గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు సరుబుజ్జిలి ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.
ఎల్‌ఎన్ పేట, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోవిలాం గ్రామంలో ఎన్నికల సందర్భంగా గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు సరుబుజ్జిలి ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీకి చెందిన కొలగాన సత్యంనాయుడు, వెంకటరమణ, కెల్ల ప్రశాంత్, నవీన్ తమపై దాడి చేసి గాయపరిచినట్టు టీడీపీకి చెందిన జి.సింహాచలం ఫిర్యాదు ఇచ్చినట్టు ఎస్‌ఐ చెప్పారు. గాయపడిన సింహాచలాన్ని చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.