Share News

నిబంధనలు ఉల్లంఘించిన ఆరు దుకాణాలపై కేసు

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:01 AM

నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించకుండా ఉండేందుకు విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఆరు దుకాణాలపై కేసు

రూ.82 వేల విలువైన 1,100 కిలోల బియ్యం, కందిపప్పు స్వాధీనం

శ్రీకాకుళం క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించకుండా ఉండేందుకు విజిలెన్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం ప్రాం తీయ నిఘా అమలు అధికారి వివేకానంద ఆధ్వర్యంలో శుక్రవారం ఆమ దాలవలస, రాగోలు ప్రాంతాల్లోని పలు కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌లను తనిఖీ చేశారు. సౌభాగ్యలక్ష్మీ రైస్‌ ట్రేడర్స్‌, మైస్టోర్‌, స్టార్‌, బాలాజీ, రిజాయిస్‌, ఎస్‌ఎస్‌ సూపర్‌ మార్కెట్‌లలో తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరు దుకాణాలపై లీగల్‌ మెట్రా లజీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూ. 82,010 విలువ చేసే 1,100 కిలోల బియ్యం, 30 కిలోల కందిపప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ సతీష్‌ కుమార్‌, ఎస్‌ఐ రామారావు, లీగల్‌ మెట్రాలజీ అధికారి బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 12:01 AM