మహిళను మోసగించిన వ్యక్తిపై కేసు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:17 AM
మండలంలో ఓ వివాహితను మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు రూరల్ పోలీసులు శనివారం తెలిపారు.
శ్రీకాకుళం రూరల్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మండలంలో ఓ వివాహితను మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు రూరల్ పోలీసులు శనివారం తెలిపారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఓ గ్రామానికి చెందిన మహిళ తన భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం ఓ వ్యక్తిని సంప్రదించింది. సదరు వ్యక్తి ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేసినట్టు బాధితురాలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌ఐ కె.రాము తెలిపారు.