Share News

డోలీలో మోస్తూ.. నాలుగు కిలోమీటర్లు నడిచి..

ABN , Publish Date - May 05 , 2026 | 12:04 AM

There is no road to Lingupuram, peoples are facing problems హిరమండలం మండలంలోని లోకొండ పంచాయతీ లింగుపురం గ్రామానికి రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పురిటినొప్పుల సమయంలో గర్భిణులను, అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీలే దిక్కవుతున్నాయి.

డోలీలో మోస్తూ.. నాలుగు కిలోమీటర్లు నడిచి..
గర్భిణీ సునీతను డోలీ మోస్తూ ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

డోలీలో మోస్తూ..

నాలుగు కిలోమీటర్లు నడిచి..

- లింగుపురానికి రోడ్డు లేక ఇక్కట్లు

హిరమండలం, మే 4(ఆంధ్రజ్యోతి): హిరమండలం మండలంలోని లోకొండ పంచాయతీ లింగుపురం గ్రామానికి రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పురిటినొప్పుల సమయంలో గర్భిణులను, అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీలే దిక్కవుతున్నాయి. గ్రామానికి చెందిన బిడ్డిక సునీతకు సోమవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డోలీలో ఆమెను మోసుకుంటూ.. నాలుగు కిలోమీటర్ల మేర నడిచి మామిడిజోల గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో పాతపట్నం క్లస్టర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ ప్రసవమైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. లింగుపురానికి రహదారి సదుపాయం కల్పించేందుకు నిధులు మంజూరైనా నేటికి పనులు చేపట్టకపోవడంతో డోలీమోతలు తప్పడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 12:04 AM