కారు అదుపు తప్పి.. లారీని ఢీకొని
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:34 AM
జాతీయ రహదారి నెమలి నారా యణపురం బైపాస్ వ ద్ద పూరీ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఎదు రుగా వస్తున్న లారీని ఢీ కొంది.
ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
క్షతగాత్రులది ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి
పలాస, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నెమలి నారా యణపురం బైపాస్ వ ద్ద పూరీ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ఎదు రుగా వస్తున్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా.. వీరిలో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాలోని పూరిలో దైవదర్శనం కోసం అదే రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన ముఖేష్ పాణిగ్రాహి, అమూల్య పాత్రో, అచ్చుతా నందబర డా (డ్రైవర్) వెళ్లి తిరిగి వస్తుండగా.. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, భారీ వర్షం కుస్తు న్న సమంలో కారు అదుపుతప్పి డివైడర్ దాటుకు ని దూసుకువెళ్లిపోయింది. ఇదే సమయంలో ఎదు రుగా వస్తున్న లారీని ఢీకొట్టి సమీప పంట పొలాల్లోకి పల్టీలు కొట్టిపడింది. దీంతో కారు ను జ్జవ్వగా.. అందులో ప్రయాణిస్తున్నవారంతా తీవ్రం గా గాయపడ్డారు. ముఖేష్ పాణిగ్రాహి, డ్రైవర్ అ చ్చుతానంద బరడాకు తీవ్రంగా గాయపడి అప స్మారక స్థితిలోకి చేరుకున్నారు. స్థానికులు ప్రమా దాన్ని గుర్తించి కారులో ఉన్న వారిని అతికష్టంపై బయటకు తీశారు. అనంతరం హైవే అంబు లెన్స్‌లో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.