Share News

లారీని ఢీకొన్న కారు

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:40 PM

మందస మండలం బాలిగాం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

   లారీని ఢీకొన్న కారు
ప్రమాదానికి గురైన కారు

- ఇద్దరు మృతి.. ఇద్దరికి గాయాలు

- బాధితులది ఒడిశా రాష్ట్ర కటక్‌

హరిపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మందస మండలం బాలిగాం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం కటక్‌కు చెందిన షేక్‌ ఖాదర్‌, పీయూష్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కారులో విశాఖపట్నం వైపు వెళ్తుండగా ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాలిగాం వద్ద హైవేపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. తరువాత పక్క రోడ్డులోకి వెళ్లి ఎదురుగా పలాస నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న షేక్‌ ఖాదర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన పీయూష్‌కుమార్‌ను శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Feb 22 , 2026 | 11:40 PM