Share News

ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:48 PM

శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య 323వ నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం చేపట్టిన పలువురు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
తప్పెటగుళ్లు ప్రదర్శిస్తున్న కళాకారులు

శ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య 323వ నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శనివారం చేపట్టిన పలువురు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్థాని క బాపూజీ కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమం లో వక్తలు మాట్లాడుతూ.. జానపద కళలు సంప్రదా యాలకు ప్రతీకలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉందని పలువురు వక్తలు అన్నారు. పేద కళాకారులకు పెన్షన్‌ను అందించారు. ఈ సందర్భంగా బోనెల అసిరయ్య జముకుల పాట, చిన తుంబయ్య పేటకు చెందిన గొర్రెల మల్లేశ్వర రావు బృందం ఎరుకల పాటను ప్రదర్శించారు. ఎస్‌ఎం పురానికి చెందిన కోరాడ సత్తిబాబు తప్పెట గుళ్ల ప్రదర్శన, పెదపాడుకు చెందిన సవలాపురపు పాపారావు బృందం డప్పు వాయిద్య విన్యాసాలు ఆకట్టుకు న్నాయి. అనంతరం కళాకారులను నిర్వాహకులు అభినందించారు. సమాఖ్య కార్యక్ర మాలకు ప్రతినెలా ప్రోత్స హించిన ముట్నూరు కామేశం మృతి చెందగా సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో సమా ఖ్య అధ్యక్షుడు ఎం.రామలింగస్వామి, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కలగ గణేష్‌ యాదవ్‌, రంగోయి వ్యవస్థాపక అధ్యక్షుడు బద్రి కూర్మారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నర్సింహమూర్తి, కార్యదర్శి రామచంద్రదేవ్‌, ఐ.రమణారావు, ఆరంగి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:48 PM