అవగాహనతోనే క్యాన్సర్ నివారణ
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:10 PM
ముంద స్తు అవగాహనతోనే క్యా న్సర్‌ను నివారించవచ్చు నని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
- ర్యాలీలో ఎమ్మెల్యే శంకర్
అరసవల్లి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ముంద స్తు అవగాహనతోనే క్యా న్సర్‌ను నివారించవచ్చు నని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సంద ర్భంగా బుధవారం జెమ్స్, కిమ్స్ ఆసుపత్రుల ఆధ్వ ర్యంలో నిర్వహించిన అవ గాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందన్నారు. వ్యాయామం, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ దరి చేరదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవా లని, తద్వారా ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.