కూటమి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేయండి
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:11 AM
: పలాస-కాశీబుగ్గ ముని సిపాలిటీలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రచా రం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆదివారం పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల 36 వార్డుల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి వజ్జ గంగాభవానితో కలిసి పర్యటించా రు.
కాశీబుగ్గ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ ముని సిపాలిటీలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రచా రం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆదివారం పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల 36 వార్డుల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి వజ్జ గంగాభవానితో కలిసి పర్యటించా రు. ఈసందర్బంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఎన్ని కల్లో మునిసిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవానికి, 23వ వార్డు తరుపున పోటీచేస్తున్న కణితి అశోక్‌కు గెలిపించాలని కోరారు. వార్డులో రోడ్లు, డ్రైనేజీలు లేవని, తాగడానికి మంచినీరు కోసం సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు అయిన వెంటనే ఆ మూడు పనుల కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారం భిస్తానని హామీఇచ్చారు. అనంతరం 23వ వార్డులో వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు చేరారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు, మోహన్‌రావు, బడ్డ నాగ రాజు, శ్రీనివాస్, నరేంద్ర, గాలి కృష్ణారావు పాల్గొన్నారు.
ఫ పలాస, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ నాయకుల వల్ల రాష్ట్రం అధోగతిపాలయ్యిందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మో హన్ నాయుడు తెలిపారు. ఆదివారం పలాసలో మునిసిపాలిటీ కళింగకోమట్ల సంఘం ఆత్మీయ సమావేశంలో రామ్మోహన్‌నా యుడు మాట్లాడుతూ కళింగ కోమట్లను ఓబీసీ జాబితాలో చేర్పిం చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని, వజ్జ బాబూరావు, కోట్ని దుర్గాప్రసాద్, శాసనపురి మురళీకృష్ణ, లొడగల కామేశ్వరరావు యాదవ్, మల్లా శ్రీనివాస్, దుర్గారావు పాల్గొనగా టంకాల రవిశంకర్‌గుప్తా సభకు అధ్యక్షత వహించారు.