Share News

ముగిసిన ప్రచారం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:13 AM

Srikakulam Corporation elections tomorrow శ్రీకాకుళం నగరపాలక సంస్థకు, ఆమదాలవలస మున్సిపాలిటీకి, అలాగే తొలివిడతలో పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు ప్రచార హోరు మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌ మేయర్‌తోపాటు 60 డివిజన్లల్లో కార్పొరేటర్‌ స్థానాలకు, ఆమదాలవలసలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌తోపాటు 28 వార్డుస్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

ముగిసిన ప్రచారం
ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, మేయర్‌ అభ్యర్థి రాధారాణి

రేపు శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీలో ఎన్నికలు

పలాస రెవెన్యూ డివిజన్‌లో తొలివిడత పంచాయతీ పోరు కూడా..

శ్రీకాకుళం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థకు, ఆమదాలవలస మున్సిపాలిటీకి, అలాగే తొలివిడతలో పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు ప్రచార హోరు మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌ మేయర్‌తోపాటు 60 డివిజన్లల్లో కార్పొరేటర్‌ స్థానాలకు, ఆమదాలవలసలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌తోపాటు 28 వార్డుస్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పలాస రెవెన్యూ డివిజన్‌లో 173 పంచాయతీలకు, 1033 వార్డు స్థానాలకు కూడా అదే రోజు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చివరిరోజు మంగళవారం సాయంత్రం వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, మద్దతుదారులు ర్యాలీలతో హోరెత్తించారు. ప్రచారం ముగిసిన తర్వాత.. రాత్రి నుంచి ఓటర్లకు తాయిలాలు పంపకాలు ఆరంభమయ్యాయి. ఓటర్లను పోలింగ్‌ వరకు తీసుకువచ్చి బ్యాలెట్‌లపై తమకు అనుకూలంగా ఓటు వేసేలా అంతర్గత ప్రచారాలు.. ఫోన్ల ద్వారాను.. బంధువులతో.. చోటా నాయకులతో ప్రక్రియను ఆరంభించారు. మేయర్‌, కార్పొరేటర్‌ స్థానాలకు మొత్తం 173 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఆమదాలవలస మున్సిపాలిటీకి 68 మంది పోటీలో ఉన్నారు. ఈ నెల 26న ఎన్నికలు జరుగునుండగా.. ఫలితాలు మాత్రం 30న వెల్లడి కానున్నాయి.

తొలివిడత మొత్తం 194 పంచాయతీలకు గాను 21 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 173 మంది సర్పంచ్‌ స్థానాలకు 437 మంది బరిలో ఉన్నారు. అలాగే 1,922 వార్డులకు గాను 886 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1033 వార్డు మెంబర్ల స్థానాలకు 2,192 మంది పోటీలో ఉన్నారు. ప్రచార హోరు ముగియడంతో... పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. గురువారం పోలింగ్‌ రోజు మధ్యాహ్నమే పంచాయతీ ఫలితాలు వెల్లడికానున్నాయి.

Updated Date - Nov 25 , 2026 | 12:13 AM