ఏఎస్‌కవిటిలో లేగదూడల ప్రదర్శన
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:57 PM
మండలంలోని ఏఎస్‌కవిటిలో రాష్ట్రీయ గోకుల్‌మిషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆడ లేగదూడలను ప్రదర్శన నిర్వహించారు.
పాతపట్నం/రూరల్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏఎస్‌కవిటిలో రాష్ట్రీయ గోకుల్‌మిషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆడ లేగదూడలను ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశుగణాభివృద్ధిసంస్థ ఎక్జిక్యూటివ్ అధికారి డి. సత్యప్రకాశ్ మాట్లాడుతూ లేగదూడల పెంపకాలపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు ప్రఽథమ బహుమతి తూలుగు సంజీవరావు, అంపోలు గోపి, ద్వితీయ బహుమతి పెద్దింటి తేజేశ్వరరావు, సదా కృష్ణారావు, తృతీయబహుమతి గడ్డి ఆనందరావు, తూలుగు మన్మఽథరావులకు అందజేశారు. కార్య క్రమంలో సర్పంచ్ నక్క మార్కండేయులు, పశువైద్యులు అనీల్, బి.శ్రీవాణి, కొంగాన సంజీవరావు, అంపోలు భాస్కరరావు పాల్గొన్నారు.