చికిత్స పొందుతూ కేబుల్ ఆపరేటర్ మృతి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:24 AM
మడపాం గ్రామానికి చెందిన మల్లిపెద్ది కిశోర్ కుమార్(55) శ్రీకాకుళం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్టు ఎస్‌ఐ బి.గణేష్ తెలిపారు.
నరసన్నపేట, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మడపాం గ్రామానికి చెందిన మల్లిపెద్ది కిశోర్ కుమార్(55) శ్రీకాకుళం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్టు ఎస్‌ఐ బి.గణేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 11న మాకివలస గ్రామంలో కేబుల్ రిపేర్ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో నిచ్చెనపై నుంచి కిందపడిపోవడంతో తలకు గాయాలయ్యా యి. వెంటనే స్థానికులు మాకివలస పీహెచ్‌సీ తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్సకోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి శ్రీకాకుళంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. కిశోర్‌కుమార్ భార్య సంతోషికుమారి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు ఎస్‌ఐ గణేష్ తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
వృద్ధురాలి ఆత్మహత్య
నందిగాం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): సుభద్రాపురం గ్రామానికి చెందిన కుజ్జ గడ్డెమ్మ(60) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గడ్డెమ్మ భర్త పెరుమాళ్లు పది నెలల కిందట మృతిచెందాడు. దీంతో ఆమె కుమారుడి వద్ద ఉంటుంది. కొన్నాళ్లగా ఈమె మానసిక పరిస్థితి బాగోలేకుంది. గురువారం ఇంటో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. దీంతో స్థానికులు గుర్తించి వెంటనే టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమచికిత్స అందించి శ్రీకాకుళం రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందింది. కుమా రుడు షన్ముఖరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్‌మహ్మద్ ఆలీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.